సిరిసిల్లటౌన్: చిన్నప్పటి నుంచి పెంచుకున్న దేశభక్తి, గాంధీపై ప్రేమ అతడిని కలెక్షన్ కింగ్‌గా మార్చింది. దేశంలో స్వాతంత్రం ముందునుంచి, అనంతరం ముద్రించిన కరెన్సీ భద్రపరిచాడు సిరిసిల్లకు చెందిన సాయిరాం. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బాపూజీ బొమ్మలతో వెలువడిన రూపాయి నాణేలనూ సేకరించారు. ఇప్పటి వరకు 200కు పైగా దేశాలకు సంబంధించి వివిధ రకాల నాణేలు, కరెన్సీని సేకరించి సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్‌లో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 12 ఏళ్ల వయసులోనే ఈ సేకరణ మొదలైన ఆయన ప్రయత్నం ఇంకా కొనసాగుతోంది.


