జమ్మికుంట: అనుబంధాల కు రాఖీ పండుగ మారుపేరుగా నిలుస్తోంది. రాఖీతో సో దర, సోదరీమణుల అనుబంధాలను మరింత దగ్గర చేసేందుకు తపాలాశాఖ తనవంతు సేవలందిస్తోంది. ఐటీపీఎస్, ఇంటర్నేషనల్ టి కెట్ ప్యాకెట్ సర్వీస్‌ను ప్రత్యేకంగా ప్రారంభించిందని జమ్మికుంట తపాలాశాఖ పోస్టుమాస్టర్ మహేందర్ శనివారం తెలిపారు. ఐటీపీఎస్‌తో రాఖీలను చౌకధరలతో విదేశాల్లో ఉన్నవారికి పంపే అవకాశం ఉందన్నారు. 20 గ్రాముల లెటర్ రూ.253, 2కిలోల వరకు పార్శిల్‌ను రూ.660, రెండున్నర కిలోలున్న పార్శిల్‌ను రూ.1180 చార్జీలతో విదేశాలకు పంపొచ్చని తెలిపారు. పార్శిల్ చేసిన ఏడు రోజుల నుంచి 15రోజుల్లో చేరుతుందన్నారు. ఐటీపీఎస్ సేవలో 2 కిలోల బరువుతో చిన్న పార్శిల్స్, మొదటి నుంచి చివరి వరకు పంపిన వస్తువు ట్రాకింగ్‌తో తెలుసుకోవచ్చన్నారు. డెలివరీ విషయంలో ఇబ్బందులు ఎదురైతే ఆన్‌లైన్ ద్వారా సూపరింటెండెంట్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తపాలా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


