రాజేందర్‌రెడ్డి మృతికి ఎమ్మెల్యేనే కారణం | - | Sakshi
Sakshi News home page

రాజేందర్‌రెడ్డి మృతికి ఎమ్మెల్యేనే కారణం

Aug 9 2026 1:52 AM | Updated on Aug 9 2026 1:52 AM

● మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

గన్నేరువరం: గుండ్లపల్లికి చెందిన బేతెల్లి రాజేందర్‌రెడ్డి ఆత్మహత్యకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కారణమని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆరోపించారు. రాజేందర్‌రెడ్డి కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. కుట్ర పూరితంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఎమ్మెల్యేకు చెప్పుకుందామని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజేందర్‌రెడ్డిని వేధింపులకు గురి చేయడంతోనే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ ఘటననకు సంబంధించి క్యాంపు కార్యాలయంలోని సీసీ పుటేజీని పోలీసులు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డి ఆగడాలు శృతిమించుతున్నాయని ధ్వజమెత్తారు. రాజేందర్‌రెడ్డి కుటుంబానికి రూ.కోటి సాయం అందించాలని, రాజేందర్‌రెడ్డి భార్య సమతకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లో కుటుంబానికి న్యాయం జరుగకాపోతే బీఆర్‌ఎస్‌ శ్రేణులు, బాధితులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజేందర్‌రెడ్డి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన భార్య సమత డిమాండ్‌ చేశారు. సిద్దం వేణు, గంప వెంకన్న, మాడుగుల రవీందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, మహేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement