తప్పు చేస్తే కటకటాలే.. | - | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే కటకటాలే..

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

‘సిరిసిల్లకు చెందిన బుర్లా చంద్రశేఖర్‌ పట్టణానికి చెందిన ఒక మైనర్‌ బాలికను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణలో భాగంగా ఏఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్‌ ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. 15 మంది సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. శాసీ్త్రయ ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్లు జైలు, రూ.2వేలు జరిమానా విధించారు.

సిరిసిల్లటౌన్‌: తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందేనన్న కోణంలో పోలీసులు ముందుకెళ్తున్నారు. జిల్లాలో పోక్సో కేసుల్లో పలువురు నిందితులకు ఇటీవల జైలుశిక్షలు పడ్డాయి. కేసు నమోదైనప్పటి నుంచి చార్జిషీటుదాఖలు.. సాక్ష్యుల ప్రవేశాల వరకు జిల్లా పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్‌శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దీంతో ఇటీవల జిల్లాలో పలు పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. కొందరికి ఇరువై ఏళ్ల వరకు జైలుశిక్ష ఖరారైంది. పోక్సో కేసులు.. శిక్షలపై ప్రత్యేక కథనం.

నేరాలు.. శిక్షలు

జిల్లాలో నేరాల తగ్గింపులో భాగంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి తప్పు చేసినా ఏం జరుగుతుందిలే.. అని సమాజంలో ధీమాగా తిరిగే నేరగాళ్ల ధైర్యంపై పోలీసులు దెబ్బకొడుతున్నారు. తప్పు చేసినోళ్లకు పదేళ్లు, ఇరవై ఏళ్లు జైలుశిక్షలు పడుతున్నాయి. ఆడబిడ్డలకు ఏ చిన్న ఆపద వచ్చినా భయపడకుండా 1098, 100 నంబర్లకు కాల్‌ చేస్తే చాలు రక్షణ కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.

పోక్సో కేసుల్లో ఫాస్ట్‌‘ట్రాక్‌’ న్యాయం

పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు కావడం, పోలీసుల దర్యాప్తులు వేగిరమవుతున్నాయి. దీంతో పోక్సో కేసులు పోలీస్‌స్టేషన్‌లో నమోదుకాగానే అధికారులు విచారణను వేగం చేసి నిందితులను రిమాండ్‌ చేస్తున్నారు. అనంతరం చార్జీషీట్‌ దాఖలు, సాక్ష్యాల ప్రవేశాలు, సాంకేతిక ఆధారాలతో శిక్షలు పడేలా చూస్తున్నారు.

నేరం చేయాలన్న ఆలోచన రాకుండా చర్యలు

జైలులో నిందితులు.. కోర్టుల్లో సాక్ష్యులు

సాంకేతిక విచారణలతో పోలీసుల చార్జీషీట్స్‌

శిక్షలు ఖరారు చేస్తున్న కోర్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement