గ్రామాభివృద్ధిలో డీఆర్డీఏదే కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధిలో డీఆర్డీఏదే కీలకపాత్ర

Jul 15 2026 12:11 AM | Updated on Jul 15 2026 12:11 AM

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: గ్రామీణాభివృద్ధి, పేద కు టుంబాల సంక్షేమం, మహిళల ఆర్థిక సాధికా రతకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస కీలక భూమిక పోషిస్తోందని కలెక్టర్‌ చిత్రామిశ్రా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. పెన్షన్లు, వీబీజీ రామ్‌ జీ ఉపాధి హామీ పథకం పనులు, ప్లాంటేషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, బ్యాంకు లింకేజీ, పెన్షన్ల మ్యాపింగ్‌, హెచ్‌ఆర్‌ విభాగం పనితీరు, శ్రీనిధి కార్యకలాపాలు, మహిళా సంఘాల బలోపేతం అంశాలపై అధికారుల కు సూచనలు చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో డీఆర్డీఏ పాత్ర ఎంతో కీలకమని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సంస్థ ప్రధాన ధ్యేయంగా ఉండాలన్నారు. ప్రతి అధికారి కర్తవ్యనిష్టతో పనిచేస్తూ కార్యాలయాన్ని ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏ అంశంలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకుండా ముందుకు సాగాలని ఆదేశించారు. స్వశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళల ఆర్థిక అభ్యున్నతికి బ్యాంకు లింకేజీలు, ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బీవీజీ రామ్‌ జీ పనులను గ్రామాల అభివృద్ధిలో భాగంగా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ గీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement