జగిత్యాలక్రైం: కన్న కూతురుపైనే ఓ తండ్రి మ ద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జగిత్యాల రూ రల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఆమె తండ్రితోపాటు ఓ యువకుడు కూడా అత్యాచారానికి పాల్పడగా.. ఆమె గర్భందాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించారు. జరిగిన విషయం తల్లికి వివరించింది. దీంతో ఆమె మంగళవారం పోలీ సులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తండ్రితోపాటు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. సభ్యసమాజం తలదించుకునేలా తండ్రే కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
మెట్‌పల్లి: పట్టణంలోని టీ చర్స్ కాలనీలో మంగళవా రం అబూసోఫియాన్ (4 పై కుక్క దాడి చేసింది. పా ఠశాల నుంచి వచ్చిన తరువాత ఇంటి ముందు ఆడుకుంటున్న అబూపై కుక్క దాడి చేసింది. ఈ సంఘటనలో చేతికి గాయమైంది. ఇదే కాలనీలో సోమవారం కూడా ఇద్ద రు చిన్నారులు, ఓ వృద్ధుడిపై దాడి చేశాయి. కుక్కల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
● పంచాయితీ పెద్దమనిషి హత్య
కొడిమ్యాల: వ్యవసాయ భూమి గట్టు వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకా రం.. డబ్బుతిమ్మయ్యపల్లి కి చెందిన గాజుల రాజనర్సయ్య, గాజుల రాజయ్య మధ్య కొద్దిరోజులుగా వ్యవసాయ భూమి వి వాదం కొనసాగుతోంది. వివాదానికి సంబంధించిన పంచాయితీలో గాజుల రాజయ్య తరఫున కాంపెల్లి హనుమయ్య పెద్దమనిషిగా వ్య వహరిస్తున్నాడు. తనకు వ్యతిరేకంగా నిలిచాడ నే ఆగ్రహంతో రాజనర్సయ్య హనుమయ్యపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం మరోసారి పంచాయితీ జరగగా.. భూమి గట్టు అంశంపై హనుమయ్య మాట్లాడిన తీరుతో రాజనర్స య్య ఆగ్రహానికి గురయ్యాడు. సాయంత్రం హనుమయ్య ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై డెయిరీలో పాలు పొసేందుకు వెళ్తున్నండగా అడ్డగించి గొడవకు దిగాడు. వెంటతెచ్చుకున్న కర్రతో హనుమయ్య తలపై బలంగా కొట్టాడు. రక్తస్రా వం కా వడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.
జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం పోతా రానికి చెందిన దువ్వాక రజిత మంగళవారం ఉదయం తన హోటల్‌లో ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అంబార్ అడిగాడు. ఆమె ఇవ్వబోతుండగా.. కారంపొడి చల్లి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును కత్తెరతో కట్ చేసేందుకు యత్నించాడు. రజిత తీవ్రంగా ప్రతిఘటించడంతోపాటు, గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు.


