సుల్తానాబాద్‌ పెగ్‌ గోదాం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

సుల్తానాబాద్‌ పెగ్‌ గోదాం ముట్టడి

Jul 15 2026 12:11 AM | Updated on Jul 15 2026 12:11 AM

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పెగ్‌ గోదామును రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు మంగళవారం ముట్టడించారు. ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పెగ్‌ గోదాము, సుగ్లాంపల్లి, సుద్దాల–,1, 2, కాట్నపల్లి, పెద్దపల్లి, రాఘవాపూర్‌, పెద్దకలువలకు తరలించి పెద్దపల్లి మిల్లర్లు ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. వింగ్స్‌ ఆక్షన్‌ ఆప్షన్‌ పేరిట సొంత జిల్లా మిల్లర్లకు అవకాశం లేకుండా పోతోందని అన్నారు. పెద్దపల్లి జిల్లా కోటాస్థలాన్ని కూడా ఇతర జిల్లాల వారు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. దీంతో బియ్యం ఉత్పతిలో ఆలస్యం అవుతోందని తెలిపారు. కరీంనగర్‌లో నగునూరు, కొత్తపల్లితోపాటు నాలుగైదు పెగ్‌ గోదాములు ఉన్నా పెద్దపల్లి జిల్లాకు తరలించడం సరికాదన్నారు. జిల్లాలో 140 రైసుమిల్లుల్లో 4 లక్షల టన్నుల ధాన్యం లుందని, ఇతర జిల్లాలకు చెందిన మరో 40 వేల టన్నుల ధాన్యం వచ్చిందని తెలిపారు. సీఎంఆర్‌ తర్వాత బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియడం లేదని, ద్వారా మిల్లింగ్‌ ఆలస్యమై, తర్వాత తాము డీఫాల్టర్లుగా మారుతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల బియ్యం సుల్తానాబాద్‌కు రాకుండా కట్టడి చేయాలని సివిల్‌ సప్లయ్‌ అధికారులను డిమాండ్‌ చేశారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా ఇతర జిల్లాల నుంచి వస్తూనే ఉందని అన్నారు. అనంతరం ఎఫ్‌సీఐ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి తిరుపతిరెడ్డి, నగునూరి అశోక్‌ కుమార్‌, చీటీ కేశవరావు, ఎడవెల్లి విజయ్‌పాల్‌రెడ్డి, ప్రసాద్‌, సముద్రాల ధర్మేందర్‌, పల్ల వాసు, రాజన్నప్రసాద్‌, వెంగల్‌రావు, అల్లంకి శ్రీనివాస్‌, మల్లారెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సాగర్‌రావు, మారుతి పాల్గొన్నారు.

ఒక్కటైన రైస్‌ మిల్లర్లు

గతంలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాలుగు గ్రూ పులుగా విడిపోయి ఎవరికి వారే అధికారులను కలిసి తమకు కోటా కేటాయించాలని విన్నవించేవారు. గోదాములు ఖాళీ లేక సమస్య జటిలం కావడంతో కొందరు గ్రూపుల మధ్య కుదుర్చారు. సమస్య తలెత్తినప్పుడు ఒక్కతాటిపైకి రావడంతో పలు సమస్యలు పరిష్కరించుకోవచ్చని భావిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మిల్లర్లకే కేటాయించాలి

రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుల

డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement