పోరాడి ఓడిన సాయి తిరుమల్‌ | - | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సాయి తిరుమల్‌

Jul 15 2026 12:11 AM | Updated on Jul 15 2026 12:11 AM

పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం సాయితిరుమల్‌గౌడ్‌ మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. గతనెల 21న గ్రామశివారులో బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్రగాయమై కోమా లోకి వెళ్లాడు. తొలుత కరీంనగర్‌, ఆ తర్వాత హైద రాబాద్‌లోని కిమ్స్‌కు.. చివరకు గాంధీ ఆస్పత్రికి తరలించి దాదా పు 22రోజులపాటు చికిత్స అందించారు. అయినా, సాయి తిరుమల్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోకగా విషమించి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. పొన్నం శంకర్‌– రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, సాయి తిరుమల్‌ కు మారుడు. శంకర్‌ స్థానిక అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపె నీలో లోడింగ్‌ విభాగంలో కార్మికుడిగా పనిచేస్తున్నా డు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు అ కా ల మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ఆపన్నహస్తం అందించినా దక్కని ప్రాణాలు

సాయి తిరమల్‌గౌడ్‌ వైద్యచికిత్స కోసం దాదాపు రూ.20లక్షల వరకు ఖర్చు చేశారు. పేద కుటుంబం కావడంతో స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు సోషల్‌మీడియా ద్వారా దీనస్థితిని గురించి వివరిస్తూ వైద్యచికిత్సలకు సహకారం అందించాలని ప్రచారం నిర్వహించారు. ఈనేపథ్యంలో మానవతావాదులు, మిత్రులు, బంధువులు, గ్రామస్తులు, గౌడకులస్తులు తమకు తోచినంత విరాళాలు అందజేశారు. అందరూ కలిసి పెద్దఎత్తున ఆర్థికసాయం చేసినా.. సాయి తిరుమల్‌ ప్రాణాలు దక్కకపోవడంతో సాయం అందించిన వారందరూ తీవ్ర మనోవేదన చెందారు.

22 రోజులుగా ఆస్పత్రిలోనే..

ఆపన్నహస్తం అందించినా దక్కని ప్రాణాలు

ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement