● ఇద్దరికి స్వల్ప గాయాలు
● నిలిచిన విద్యుత్ సరఫరా
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారు.. జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు కిందివైపు ఉన్న రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొని చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. జగిత్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పని నిమిత్తం కారులో కోరుట్లకు వెళ్తుండగా.. అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు స్తంభాలు విరగడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు చేపట్టి విద్యుత్ సరఫరా పునరద్ధరించారు.


