700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

● సీపీ గౌస్‌ ఆలం

జమ్మికుంట: కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా 700 సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యమని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. జమ్మికుంట టౌన్‌, రూరల్‌ సీఐలు రామకృష్ణ, పులి వెంకట్‌ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్‌ టోర్నీ విజేతలకు బహుమతులు అందించారు. క్రికెట్‌ టోర్నీ ప్రారంభించారు. కోరపల్లి, సైదాబాద్‌ గ్రామాల్లో 21సీసీ కెమెరాలు ప్రారంభించారు. ప్రీప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. జమ్మికుంటలో ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువత సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, డ్రగ్స్‌, మత్తు పదార్థాలువి నియోగంతో జీవితాలు నాశనం చేసుకోకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల్లో పోలీసులే కాకుండా ప్రతి పౌరుడు బాధితులకు సహకారంగా నిలవాలన్నారు. హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి, ఎస్సైలు అవుల తిరుపతి, స్వాతి, క్రాంతి కుమార్‌, శేఖర్‌రెడ్డి, ఎంఈవో హేమలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement