ఆసరాగా ఉంటావనుకుంటే అనాథను చేశావా కొడుకా | - | Sakshi
Sakshi News home page

ఆసరాగా ఉంటావనుకుంటే అనాథను చేశావా కొడుకా

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

రుద్రంగి(వేములవాడ): ఆసరాగా ఉంటావనుకుంటే అనాథను చేశావా కొడుకా.. అంటూ ఆ మాతృమూర్తి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అవిటివాడిగా మారిన యువకుడు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. రుద్రంగి ఎస్సై మోతిరాంనాయక్‌ తెలిపిన వివరాలు. రుద్రంగి మండల కేంద్రనికి చెందిన రాగుల స్వామి(25) ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మద్యంమత్తులో బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకున్నాడు. స్వామి చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో తల్లి కష్టపడి పెంచింది. చేతికందిన కొడుకు తోడుగా ఉంటాడనుకునే సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. తల్లి సుజాత ఫిర్యాదుతో కేసు చేశారు.

కదిలించిన తల్లి రోదనలు

మద్యంమత్తులో యువకుని ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement