జనరేటర్‌తో నారుమడికి నీరు | - | Sakshi
Sakshi News home page

జనరేటర్‌తో నారుమడికి నీరు

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

ఆరు రోజుల క్రితం కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌

పట్టించుకోని అధికారులు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆరు రోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోగా.. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. విసిగివేసారిపోయిన రైతు జనరేటర్‌ సాయంతో నారుమడిని బతికించుకుంటున్నాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన దాసరి సత్తయ్యకు రాచర్లతిమ్మాపూర్‌ శివారులో తనకున్న నాలుగెకరాల్లో వరి సాగుచేసేందుకు నారు పోసి, దుక్కిని సిద్ధం చేశాడు. ఈక్రమంలోనే ఆరు రోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. ఈ విషయమై విద్యుత్‌ అధికారులను కలిస్తే వారు స్పందించలేదు. దీంతో నారుమడికి నీరు అందించేందుకు రోజుకు రూ.2500 వెచ్చించి జనరేటర్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికై నా విద్యుత్‌ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement