ఊపిరాడకుండా చేసి.. ఆభరణాలు దొంగిలించి.. | - | Sakshi
Sakshi News home page

ఊపిరాడకుండా చేసి.. ఆభరణాలు దొంగిలించి..

Jul 9 2026 6:59 AM | Updated on Jul 9 2026 6:59 AM

వృద్ధురాలిది హత్య అని అనుమానం

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చంద్రబాబుకాలకి చెందిన ఎల్లపూల రమణమ్మ(65) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్తకు ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్‌లోని కుమారుని వద్దకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అక్కడే చనిపోగా అంత్యక్రియలూ అక్కడే చేశారు. భర్త డెత్‌ సర్టిఫికెట్‌ కోసం గతనెల 10న గోదావరిఖనిలోని తన ఇంటికి వచ్చింది. ఈనెల 30న అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. ఆమె మెడ లోని బంగారు గొ లుసు, చెవికమ్మలు, ఐదు తులాల బంగారు గాజులు కనిపించలేదని ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు.

పీఎంఈ నివేదికతో హత్యగా అనుమానం?

పీఎంఈ నివేదిక ఆధారంగా వృద్ధురాలిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు అనుమానిస్తూ కేసును తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనుమా నితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ ఫు టేజీలు, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా రు. చనిపోయే సమయంలో బాధితురాలు పెద్దగా ప్రతిఘటించకపోవడంతో తెలిసినవారే హత్య చేసి నట్లుగా పోలీసులు అనుమానిస్తూ అన్నికోణాల్లోంచి దర్యాపు ప్రారంభించారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుమారుడితో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏసీపీ రమేశ్‌, సీఐ ఇంద్రసేనారెడ్డి ద్వారా కేసు పురోగతిపై ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement