దైవదర్శనం చేసుకొని ఇంటికి వెళ్తుండగా..
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): దైవదర్శనం అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. వారి కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మారుతినగర్ శివారులో జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్(41), అతడి భార్య లావణ్య(35), పదిహేనేళ్ల కూతురు కీర్తి శనివారం కొండగట్టు అంజన్నస్వామి దర్శనానికి కారులో వచ్చారు. దర్శనం తర్వాత కుటుంబసభ్యులు సాయంత్రం సమయంలో తిరిగి ఇంటికి పయణమయ్యారు. ఈ క్రమంలో మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుతినగర్ శివారులోకి చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న లారీ, వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొన్నాయి. దంపతులు తీవ్రగాయాలపాలై మృతిచెందారు. కీర్తి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో మోహన్ మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసేందుకు స్థానికులు రెండుగంటల పాటు శ్రమించారు. ఘటన స్థలాన్ని మెట్‌పల్లి సీఐ అనిల్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం మోహన్–లావణ్య దంపతుల మృతదేహాలను మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మోహన్(ఫైల్)
లావణ్య(ఫైల్)
మెట్‌పల్లి మండలం మారుతినగర్‌లో లారీ–కారు ఢీ
దంపతులు మృతి, కూతురు పరిస్థితి విషమం
మృతులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారు
దైవదర్శనం చేసుకొని ఇంటికి వెళ్తుండగా..
దైవదర్శనం చేసుకొని ఇంటికి వెళ్తుండగా..


