5లక్షల గొర్రెలకు నట్టలమందు
కరీంనగర్‌రూరల్: జిల్లాలోని 5.20లక్షల గొర్రెలు, మేకలకు ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తోందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.లింగారెడ్డి తెలిపారు. శనివారం కరీంనగర్ మండలం చేగుర్తిలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 25 పశువైద్యశాలలు, 37 ఉపకేంద్రాల ద్వారా గొర్రెలు, మేకలకు నట్టల నివారణమందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేస్తున్న నట్టల నివారణ మందును గొర్రెపెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్, సర్పంచ్ బాషవేణి సరోజన, ఉపసర్పంచ్ గాలిపల్లి రవీందర్, పశువైద్యులు జ్యోత్స్య, రామకృష్ణ, గట్టయ్య పాల్గొన్నారు.


