చలితో జాగ్రత్త..
కరీంనగర్: చలి గాలులు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. కొద్దిరోజుల నుంచి విపరీతమైన చలి, పొగమంచు కారణంగా పట్టపగలు కూడా సూర్యుడి ప్రభావం కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. శీతల గాలుల ప్రభావం, సమతుల్యత లేని వాతావరణం, కాలుష్యంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణతో శనివారం ‘సాక్షి’ ఫోన్‌ఇన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డీఎంహెచ్‌వో వివరంగా సమాధానం ఇచ్చారు.


