పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమీక్ష
కరీంనగర్‌క్రైం: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాల ప్రకారం.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డి.శరత్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమీక్ష సమావేశం శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. శరత్ మాట్లాడుతూ ప్రాసిక్యూటర్లు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కేసుల విచారణ సమయంలో పూర్తి అవగాహనతో వెళ్లాలని సూచించారు. అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వేముల లక్ష్మీ ప్రసాద్ బెయిల్ పిటిషన్లతోపాటు కేసుల విచారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మల్యాల ప్రతాప్, రవీందర్, మంచికట్ల రాజేశం, సీహెచ్ రామకృష్ణ, గౌరు రాజిరెడ్డి, కుమారస్వామి, ఆరెల్లి రాములు, కాసారం మల్లేశం, బిట్ల నర్సయ్య, ఝాన్సీ, పద్మజా పాల్గొన్నారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
కరీంనగర్: కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతు కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. కోర్టు వెనుక భాగం ప్రాంతం, కెమిస్ట్‌భవన్ ఏరియా, వెంకటేశ్వర ఆలయం, శివథియేటర్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.


