కరీంనగర్‌ను నంబర్‌వన్‌స్థానంలో నిలుపుతాం
2026లో రాష్ట్రంలో కరీంనగర్‌ను నేరాల నియంత్రణలో మొదటిస్థానంలో నిలుపుతామని సీపీ గౌస్ ఆలం అన్నారు. శనివారం కమిషనరేట్‌లో వార్షిక నేరాల నివేదిక–2025ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది కన్నా ఈసారి క్రైంరేట్ తగ్గిందన్నారు. మిస్సింగ్ కేసులను లోతుగా విచారిస్తున్నామని, చాలా వరకు మిస్టరీ మర్డర్లుగా మారుతున్నాయని, నాణ్యమైన దర్యాప్తుతోనే కేసులను వేగంగా ఛేదిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త పోలీస్ స్పోర్ట్స్‌మీట్, ఎమ్మెల్సీ, గ్రామపంచాయతీ ఎన్నికలు, వివిధ పండగలు, ర్యాలీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. టాస్క్‌ఫోర్స్, ఎస్‌బీ, సీసీఎస్‌లకు నూతన భవనాలు కేటాయించామని, అన్ని పోలీసుస్టేషన్లు ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. షీలీడ్స్ ద్వారా మహిళ పోలీసులకు విధులు కేటాయించి, శిక్షణ ఇచ్చామన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, సీసీ కెమెరాల ద్వారా చాలా వరకు నేరాలు స్వల్ప వ్యవధిలోనే ఛేదిస్తున్నామన్నారు. ట్రాఫిక్ విషయంలో ప్రతీరోజు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలపై దృష్టిసారిస్తామన్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామని హెచ్చరించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్‌కుమార్, మాధవి పాల్గొన్నారు.


