రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ నేటి నుంచి
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో శని, ఆదివారాల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్, నీలం లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను వారు స్టేడియంలో పర్యవేక్షించారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. 2014లో కరీంనగర్ వేదికగా తొలిసారి రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించామని, తిరిగి 11 సంవత్సరాల అనంతరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెల్త్ ఈజ్ వెల్త్ నినాదంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. 35 నుంచి 100 మధ్య వయస్సున్న మాస్టర్ అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. రన్నింగ్, త్రోస్, జంప్స్ లాంటి 48 అంశాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు. ప్రతిభ చాటిన అథ్లెట్స్‌ను రాజస్థాన్ రాష్ట్రంలోని ఆజ్మీరాలో జరిగే జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.


