● ఘల్ ఘల్.. వెన్నుపూస ఝల్ ఝల్
కరీంనగర్ సిటీ రోడ్లపై ఈ మధ్య ప్రయాణించారా? మీ వాహనం నుంచి ఘల్ ఘల్ శబ్దం.. మీ వెన్నుపూజ నుంచి ఝల్‌ఝల్ నొప్పిని గమనించారా? అవును ఇటీవల నగరంలోని ప్రయాణిస్తున్న ప్రతీ వాహనదారుడి నుంచి ఇదే మాట వినిపిస్తోంది. నగరంలోని చౌరస్తాలు.. మూల మాలుపుల వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన రంబుల్ స్ట్రిప్స్ పరిమితికి మించి ఎత్తుగా ఉండడంతో బండి డ్యామేజ్, ఒళ్లుహూనం అవుతోందని వాహనదారులు చెబుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


