అమ్మను దొంగలెత్తుకెళ్లారమ్మా..
ముప్పిరితోటలో కొమురయ్య ఇంటి ఎదుట ఆవు కనిపించట్లేదని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
తల్లి లేక లేగదూడ ఏమి తినడం లేదని
‘సాక్షి’కి తెలుపుతున్న కొమురయ్య
అమ్మ ఎప్పుడొస్తుందోనని ఆ మూగజీవి తల్లిఆవు కోసం ఎదురుచూస్తుంటే, యజమాని గుండె తరుక్కుపోతోంది. నెలరోజులైనా ఆవు జాడ కానరాలేదని, మీ అమ్మను ఎవరో ఎత్తుకెళ్లారమ్మా అని అరిచి చెప్పాలని ఉన్నా.. ఆ లేగదూడతో చెప్పలేక కుమిలిపోతున్నాడు. ఊరూ..వాడా.. చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికినా ఫలితం లేక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని చెవుల కొమురయ్య తన ఆవును గత నెల 28న రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారంటూ ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ‘సాక్షి’కి కనిపించింది. తల్లి ఆవుకోసం గాలింపు ఒకవైపు, దూడ ఆరాటం మరోవైపు వెరసి కొమురయ్య దంపతులు నిద్రలేమి రాత్రులు గడుపుతూ, ఆవు దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
అమ్మను దొంగలెత్తుకెళ్లారమ్మా..


