అత్తింటి వేధింపులు తాళలేక..
ముత్తారం: ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌కు చెందిన పాండవుల అంజలి(21) ఐదు నెలల గర్భిణి శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండవుల స్వా మి–భాగ్యలక్ష్మి దంపతుల పెద్ద కూతురు అంజలికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లంపల్లికి చెందిన బండి వెంకటేశ్‌తో 8నెలల క్రి తం వివాహమైంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, మామల వేధింపులు తాళలేక అడవిశ్రీరాంపూర్‌లోని పుట్టింటికి వ చ్చింది. పెళ్లికి ముందు ఒప్పందం ప్రకారం క ట్నకానుకలు చెల్లించినా మళ్లీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని మనస్తాపం చెందిన అంజలి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ మడుత రమేశ్, మంథని సీఐ రాజు పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
ఉరేసుకొని గర్భిణి ఆత్మహత్య


