పురుగుల మందుతాగి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన భా రతపు శేఖర్ (35) శుక్రవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తిప్పన్నపేటకు చెందిన శేఖర్ ఇటీవలే తన భార్యతో మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో పురుగుల మందుతాగగా, ఎవరూ గమనించలేదు. సాయంత్రం ఇంట్లో ఉన్న తల్లి లోపలికి వెళ్లి చూసేసరికి మృతిచెందాడు. పోలీ సులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
మెట్‌పల్లి: పట్టణంలో ని బస్‌డిపో సమీపంలో అనుమానాస్పద స్థితిలో సుమారు 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్ తెలిపారు. నలుపు రంగు టీషర్టు, అలివ్ గ్రీన్ ప్యాంటు, పింక్ బ్లాక్ షూ ధరించి ఉన్నాడని, అతని వివరాలు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారమందించాలని ఎస్‌ఐ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ కార్మికుని మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్క పేటకు చెందిన కార్మికుడు కర్రోళ్ల నర్సయ్య(70) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు. నర్సయ్య అదే గ్రామానికి చెందిన జంగిటి దేవయ్య ట్రాక్టర్‌పై గడ్డికుప్పలు తరలించేందుకు గత నెల 28న కూలి పనికి వెళ్లాడు. ట్రాక్టర్‌ను డ్రైవర్ కొంచెం ముందుకు కదిలించగా.. పైన ఉన్న నర్సయ్య కిందపడి స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటి నుంచి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందా డు. మృతుని కుమారుడు కర్రోళ్ల స్వామి ఫిర్యాదుతో జంగిటి దేవయ్య, సాగర్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చిందు కళాకారుడు మృతి
చొప్పదండి: కాట్నపల్లికి చెందిన చిందు కళాకారుడు గజ్జెల నగదరయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. పట్టణానికి చెందిన వేముల వెంకట్‌రాజం(70) మృతిచెందగా.. దహన సంస్కారాలకు ఆర్థిక సాయం చేయాలని చొప్పదండిలోని రామకృష్ణా సేవాసమితి సభ్యులను ఆశ్రయించారు. దాత ఆడెపు సహకారంతో రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు. కొక్కుల క నకయ్య, పడకంటి కృష్ణ పాల్గొన్నారు.
పురుగుల మందుతాగి ఆత్మహత్య
పురుగుల మందుతాగి ఆత్మహత్య
పురుగుల మందుతాగి ఆత్మహత్య


