బెల్ట్‌షాపులు మూసివేయండి
● బూర్గుపల్లి పాలకవర్గానికి గ్రామస్తుల వినతి
బోయినపల్లి(చొప్పదండి): గ్రామంలో బెల్ట్‌షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయినపల్లి మండలం బూర్గుపల్లి గ్రామస్తులు శుక్రవారం గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్యకు వినతిపత్రం అందించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. సాయంత్రం అయ్యిందంటే మహిళలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబుల ఆగడాలతో మహిళలు భయాందోళన చెందుతున్నారన్నారన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే గ్రామంలో బెల్ట్‌షాపులు మూసివేయాలని కోరారు.
అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
● రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రిస్వామి
తిమ్మాపూర్: ధూప దీప నైవేద్య అర్చుకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రిస్వామి కోరారు. కరీంనగర్‌లో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలో మాట్లాడారు. హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ మాట్లాడుతూ డీడీఏ అర్చకుల వేతనం రూ.35వేలకు పెంచాలని, ప్రతీ నెల 5లోపు వేతనం ఇవ్వాలని, అర్చక సంక్షేమ పథకాల అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ శ్రీరంగం గోపి కృష్ణమాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవర్జుల ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసమూర్తి, వెగ్గళం సంతోష్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మాధవాచార్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకవరం మఠం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బెల్ట్‌షాపులు మూసివేయండి


