ప్రకృతి సోయగం
విరబూసిన మోదుగుచెట్టు
భట్టుపల్లి సమీపంలో రంగురంగు ఆకులతో చెట్టు
మంథనిరూరల్: ప్రకృతిలో కాలానికనుకుణంగా చెట్లు తమ సహజతత్వాన్ని చాటుతుంటాయి. ఒక్కో చెట్టు ఒక్కో కాలంలో చోటు చేసుకునే మార్పులు కనువిందు చేస్తుంటాయి. కొన్ని చెట్లు విరగబూసి ఆకర్షణగా నిలిస్తే, మరికొన్ని చెట్లు సీజన్ మార్పుతో చూపరులను ఆకట్టుకుంటాయి. మంథని మండలం భట్టుపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై ఓ చెట్టు ఇలా పసుపు, ఆకుపచ్చ ఆకులతో కనువిందు చేస్తోంది. అలాగే మండలంలోని గోపాల్‌పూర్‌లోని అటవీ ప్రాంతంలో మోదుగు చెట్టు ఇలా విరగబూసి చూపరులను ఆకట్టుకుంటోంది.
ప్రకృతి సోయగం


