ఎములాడలో భక్తుల సంబురం
వేములవాడ: వరుస సెలవులు రావడంతో వేములవాడకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం
50 వేల మంది భక్తులు భీమన్నను, బద్దిపోచమ్మను దర్శించుకున్నారు. భీమన్నకు కోడె.. బద్దిపోచమ్మకు బోనం మొక్కులు సమర్పించుకున్నారు. ట్రాఫిక్ ఎస్సై రాజు నేతృత్వంలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. వీఐపీ రద్దీ పెరగడంతో ప్రొటోకాల్ ఆఫీస్ బిజీగా మారింది. వీఐపీలకు రూ.500 కోడె టికెట్, రూ.300 టికెట్‌తో బ్రేక్ దర్శనాలకు అనుమతించారు. భక్తుల వద్ద డబ్బులు తీసుకుని దర్శనాలు చేయిస్తున్న ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులను ఆలయ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ చేపట్టి ఏడుగురిని రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు.
ఎములాడలో భక్తుల సంబురం


