స్వల్పంగా పెరిగిన రైల్వేచార్జీలు
రామగుండం: భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే చార్జీలను స్వల్పంగా పెంచింది. 215 కిలోమీటర్లపై ప్రయాణించే వారిపై కిలోమీటర్‌కు పైసా చొప్పున టికెట్ ధర పెంచుతూ శుక్రవారం నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఆరు నెలల క్రితమే స్వల్పంగా పెంచిన చార్జీల నేపథ్యంలో ఆర్డినరీ, నాన్ ఏసీ 215 కిలోమీటర్లపై ప్రయాణించే వారిపై కిలోమీటరుకు పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కిలోమీటర్‌కు రెండు పైసల పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, హంసఫర్, తేజస్, అమృత్‌భారత్ తదితర రైళ్లతో పాటు ప్రీమియం రైళ్లకు పెంపు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. కాగా లోకల్ రైళ్లు, నెలసరి సీజన్ టికెట్లు, రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జీ, సీఎస్‌టీ తదితర చార్జీలులు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రామగుండం–సికింద్రాబాద్‌కు పెంపు వర్తింపు
రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు 224 కిలోమీటర్లు దూరం ఉండడంతో చార్జీల పెంపు వర్తించనుంది. ఫలితంగా నిన్నటి నుంచి భాగ్యనగర్, ఇంటర్‌సిటీ రైళ్లకు రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు రూ.90 ఉండగా పెంచిన చార్జీతో రూ.95 అయింది. సూపర్‌ఫాస్ట్ చార్జీ రూ.110కి చేరింది. కాగా పెద్దపల్లి–సికింద్రాబాద్‌కు మధ్య దూరం 207 కిలోమీటర్లు ఉండడంతో చార్జీల పెంపు వర్తించకపోవడం గమనార్హం.
శుక్రవారం నుంచి అమలు


