ఘాట్‌రోడ్డుపై అదుపుతప్పిన ఆటో
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని, తిరుగు ప్రయాణంలో ఘాట్‌రోడ్డు వెంట వెళ్తున్న ఆటో బోల్తాపడి నలుగురు గాయపడిన సంఘటన మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో చోటుచేసుకుంది. గోదావరిఖని చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు శుక్రవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఘాట్‌రోడ్డు వెంట వెళ్తుండగా, ఆటో అదుపుతప్పి, గతంలో బస్సు ప్రమాదం జరిగిన స్థలంలో ఏర్పాటు చేసిన సేఫ్టీవాల్‌ను ఢీకొని బోల్తాపడింది. ఘటనలో సరస్వతి, హేమంత్ తీవ్రంగా, విద్యాధర్ శ్రీధర్, కిరణ్మయి స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి బ్లూకోల్ట్స్ సిబ్బంది సురేశ్, అంజన్న చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బాధితులను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరికి తీవ్ర, ఇద్దరికి స్పల్ప గాయాలు


