ఐదుతరాల అను‘బంధం’ | - | Sakshi
Sakshi News home page

ఐదుతరాల అను‘బంధం’

Dec 26 2025 8:15 AM | Updated on Dec 26 2025 8:15 AM

ఐదుతరాల అను‘బంధం’

ఐదుతరాల అను‘బంధం’

మంథని: ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకరమవుతున్న తరుణంలో ఆదర్శమైన అపురూప సన్నివేశం ఆవిష్కృతమైంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య అమ్మాయి దంపతుల వారసులు గురువారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ హాల్‌లో కలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 200 మంది ఒకే వేదికపై ఆనందం పంచుకున్నారు. ఆరునెలల శిశువులు మొదలు 80 ఏళ్ల వృద్ధులు ఐదుతరాల వారు ఈ అపురూప సన్నివేశంలో పాలుపంచుకున్నారు. నాటి కష్టాలను తలుచుకుంటూ నేటి విజయాలను చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నారుల ఆటాపాటలతో సంతోషంగా గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement