అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
● నెలరోజుల్లో తల్లీకొడుకుల మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన వంగల శ్రీనివాస్‌రెడ్డి(42) గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లి వంగల సుశీల నెల రోజుల క్రితం గుండెపోటుతో మరణించింది. తల్లి మొదటి మాసం పెట్టడానికి రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం తల్లికి మొదటి నెల కార్యక్రమాలు పూర్తి చేశాడు. తల్లి మరణంతో కుంగిపోయిన శ్రీనివాస్‌రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకోవడంతో అప్పుల పాలైనట్లు తెలిపారు. అప్పులు తీర్చడానికి పెద్ద ఉద్యోగం లేకపోవడం, మరోవైపు తనకు అండగా ఉన్న తల్లి మరణించడంతో మనోధైర్యం కోల్పోయి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలో తల్లి, కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య అర్చన, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.


