అమ్మానాన్న ఆశ్రమానికి అవ్వ
జ్యోతినగర్(రామగుండం): కుటుంబసభ్యులు వద్దన్నా..అవ్వకు ప్రభుత్వ అధికారులు ‘అమ్మానాన్న’లో ఆశ్రయం కల్పించారు. దిక్కులేని వారికి ప్రభుత్వమే అండగా ఉందని నిరూపించారు. వివరాలు.. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు మొగిలమ్మ కొద్దిరోజులుగా రామగుండం రాజీవల రహదారి బీ – పవర్‌హౌస్ బస్‌స్టాప్ వద్ద అనాథగా ఉంటోంది. భిక్షాటన చేయడంతోపాటు తినడానికి ఎవరైనా ఇస్తేతీసుకుని కాలం గడుపుతోంది. సమాచారం అందుకున్న జిల్లా ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి స్వర్ణలత.. కలెక్టర్ ఆదేశాల మేరకు వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి యత్నించగా.. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. శిశు సంక్షేమాధికారి ఆదేశాలతో వృద్ధురాలిని హైదరాబాదు చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించారు. నెలరోజుల క్రితం పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో ఓ వయోవృద్ధురాలు(80) కూడా ఇదేస్థితిలో ఉండడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యస్థితి బాగుపడిన తర్వాత చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రయానికి పంపించారు.
హైదరాబాద్ తరలించిన ఎఫ్‌ఆర్‌వో స్వర్ణలత
అమ్మానాన్న ఆశ్రమానికి అవ్వ


