పొగమంచుతో రైళ్ల ఆలస్యం
రామగుండం: ఉత్తరాదిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో న్యూఢిల్లీ, బిహార్, యూపీ రాష్ట్రాల నుంచి వచ్చే పలు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. అయ్యప్ప మాలాధారణ స్వాములు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. న్యూఢిల్లీ నుంచి చైన్నె, త్రివేండ్రం వైపు వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైళ్ల మంగళవారం చాలా ఆలస్యంగా నడిచాయి. మధురై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(20494) మధ్యాహ్నం 2.53 గంటలకు రామగుండం రావాల్సి ఉంది. కానీ, ఏడు గంటల ఆలస్యంతో రాత్రిపది గంటలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీ ఎక్స్‌ప్రెస్(20806) మధ్యాహ్నం 3.50గంటలకు రావాల్సి ఉండగా ఆరు గంటల ఆలస్యంగా నడుస్తోంది. జీటీ ఎక్స్‌ప్రెస్(12616) సాయంత్రం 4.10గంటలకు రావాల్సి ఉండగా 4 గంటల ఆలస్యంగా నడుస్తోంది. కేరళ ఎక్స్‌ప్రెస్(12626) మధా్‌య్‌హ్నం 3.23గంటలకు రావాల్సి ఉండగా 11 గంటల ఆలస్యంతో బుధవారం వేకువజామున నాలుగు గంటలకు రామగుండం రానుంది. సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12296 ) రాత్రి 9.45గంటలకు రావాల్సి ఉండగా రెండు గంటల ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు.


