చదువులకు లేని పైసలు అందాల పోటీలకు ఎక్కడివి?
● ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి
పెద్దపల్లి: చదువులకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం అందాల పోటీలు, ఆటలకు ఎక్కడి నుంచి వెచ్చిస్తోందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ నాలుగో మహాసభలు మంగళవారం జరిగాయి. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ విద్యార్థులకు ఇచ్చిన ఒక్కహామీ కూడా అమలు చేయలేదన్నారు. కేంద్రప్రభుత్వం మతం పేరిట రాజకీయం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి కమాన్ చౌరస్తా, ఎన్‌ఎస్ గార్డెన్ వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్ జెండాను ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మార్కపురి సూర్య ఆవిష్కరించారు. సాయిఆజాద్ అధ్యక్షతన మహాసభలు జరిగాయి. రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలసాని లెనిన్, కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, ఉపాధ్యక్షుడు మొలుగూరి నితిలేశ్, కోశాధికారి ఎల్కపల్లి సురేశ్, కార్యవర్గ సభ్యులు మాతంగి సాగర్, గుండ్లా లక్ష్మీప్రసన్న, పల్లె హర్ష, సాయిఅనుప్, సాయితేజ, పూదరి సాయి, అభిషేక్, చైత్ర, మైథిలి, సాయిశరణ్య, వైశాలి తదితరులు పాల్గొన్నారు.


