కొత్త పంటల గురించి తెలిసింది
మా ప్రాంతంలో పత్తి, జొన్న, మక్క వేస్తాం. పరిశోధన స్థానంలో సాగుచేసే ఆవాలు, అలిసెంత వంటి కొత్త పంటల గురించి తెలుసుకున్నాం. కొత్త విషయాలు తెలుసుకునేందుకు పొలాస పరిశోధన స్థానంలో జరిగే ప్రతి సదస్సుకు హాజరవుతుంటాను.
– గంగుబాయి, ఊట్నూర్, మంచిర్యాల జిల్లా
ఇక్కడ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలను ఆకళింపు చేసుకుని, మా పొలంలో ప్రయోగాలు చేస్తుంటాను. రైతు సదస్సుకు రావడంతో ఎన్నో కొత్త సాగు విషయాలు తెలిశాయి. తోటి రైతులు సాగు చేసే పంటల గురించి తెలుసుకున్నాను.
– పవన్‌కుమార్, బోధన్, నిజమాబాద్ జిల్లా
రైతు సదస్సులో ఖర్చు తగ్గించే పద్ధతులు చెప్పారు. యాసంగిలో పంటల్లో ఏ సమస్యలు వస్తాయి..? వాటిని ఎలా ఎదుర్కోనాలనే విషయాలను వివరించారు. వరిని ఎక్కువగా సాగు చేస్తుండటంతో ఇతర పంటలవైపు దృష్టి మళ్లింది.
– మహేష్, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా
కొత్త పంటల గురించి తెలిసింది
కొత్త పంటల గురించి తెలిసింది


