విద్యుత్ బిల్లు రద్దు చేయాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ బిల్లు, ససవరణ బిల్లు(విద్యుత్ ప్రైవేటీకరణ)–2025 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్, ఇంజినీర్స్ (ఎన్‌సీసీవోఈఈ) పిలుపు మేరకు మంగళవారం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ విద్యుత్ భవన్ ఆవరణలో ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ శాంతి అనే విద్యుత్తు బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు ను నిలిపివేయాలన్నారు. బిల్లును ప్రవేశపెడితే విద్యుత్ ఉద్యోగులు, రైతులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ నాయకులు రమేశ్, రఘు, రాజు, షరీఫ్, పవన్ కుమార్ వెంకట్ నారాయణ, శ్రీనివాస్, స్వామి, సంపత్ కుమార్, సత్యనారాయణ, శ్యామయ్య, శ్రీనివాస్, మహేందర్, శ్రీమతి పాల్గొన్నారు.


