త్వరలో కాంగ్రెస్ కొత్త కమిటీలు
● కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్‌కుమార్
కరీంనగర్‌కార్పొరేషన్: జనవరి 1వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కమిటీల ఎన్నిక నేపథ్యంలో పాత కమిటీలు రద్దయ్యాయని అన్నారు. వారం రోజుల్లోగా కార్పొరేషన్ పరిధిలో కమిటీలను పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం పీసీసీ నుంచి పరిశీలకులుగా నమిండ్ల శ్రీనివాస్,గుత్తా అమిత్‌రెడ్డిలు నియమితులయ్యారన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సూచన మేరకు త్వరలో పరిశీలకులతో సమావేశం ఉంటుందన్నారు. నగరంలోని 66 డివిజన్‌లకు గాను 11 డివిజన్లకు ఒకటి చొప్పున ఆరు జోన్లుగా విభజించి కమిటీలను నియమిస్తామన్నారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. నాయకులు ఎండీ.తాజ్, మడుపు మోహన్, సిరాజ్ హుస్సేన్, శ్రావణ్ నాయక్, మహమ్మద్ అజీమ్, బోనాల శ్రీనివాస్, అహమ్మద్ అలీ, అబ్దుల్ రహమాన్, వంగల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


