సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి
కరీంనగర్‌క్రైం: రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ పోలీసులకు కమిషనరేట్‌లోని కన్వెన్షన్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ గౌస్ ఆలం హాజరై మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. నేరగాళ్ల కొత్త పద్ధతులపై పోలీసులకు అవగాహన ఉంచుకోవాలన్నారు. సైబర్ మోసాలు, డిజిట ల్ అరెస్టు, యూపీఐ లావాదేవీలు, నకిలీనోట్ల గుర్తింపు, సైబర్‌నేరాలపై ఫిర్యాదు చేసే విధా నం, ఆర్‌బీఐ, అంబుడ్స్‌మెన్ల సేవలపై వివరించారు. నగదు రహిత లావాదేవీలతో కలిగే ప్ర యోజనాలు, సైబర్ భద్రతా చిట్కాలను వివరించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్‌బీఐ ఇంటిగ్రెటెడ్ బ్యాంకింగ్ మేనేజర్ సత్యజీత్ హోష్, మేనేజర్ ఖాదర్ హుస్సేన్ పాల్గొన్నారు.
మానకొండూర్: గత రెండేళ్లలో ప్రజలు బీఆర్‌ఎస్‌ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్చి పోయారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రి వడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే సత్యం చేసిన వ్యాఖ్య లను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు ఖండించారు. మానకొండూర్‌లో మంగళవారం మాట్లాడుతూ కేసీఆర్‌పై అసందర్భంగా మాట్లాడటం అనుచితమన్నారు. హైడ్రా, మూసీ అక్రమ కూల్చివేతలు, బనకచర్ల భూసే కరణపై పోరాటం చేశామన్నారు. రాజకీయ అవగాహన లేకుండా ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. మాజీ జెడ్పీటీసీ టి.శేఖర్, యాదగిరి పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్: ఉపాధి పఽథకాన్ని రద్దు చేసి, దానిస్థానంలో పేదల పొట్టగొట్టే పథకాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇందుకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం గాంధీరోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ జిల్లా నాయకుడు జిందం ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నాయకులు గుడికందుల సత్యం, గీట్ల ముకుందరెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు పాల్గొన్నారు.
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నగునూరు జెడ్పీ పాఠశాలలో మంగళవారం నెహ్రు యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్‌స్పోర్ట్స్ మీట్‌ను జిల్లా యువజనశాఖ అధికారి రాంబాబు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌పోటీలు హోరాహోరీగా జరిగాయి.కబడ్డీలో మా సేవా, నగునూరు జట్లు ఫైనల్‌కు చేరాయి. సర్పంచ్ సాయిల్ల శ్రావణి, హెచ్‌ఎం రవీందర్, మై భారత్ యూత్ వలంటరీ గణేశ్, పీడీ సౌజన్య పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి


