దాడిచేసిన వ్యక్తులపై కేసు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌కు చెందిన సంపంగి సతీశ్‌పై దాడిచేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. టీఆర్‌నగర్‌కు చెందిన సంపంగి సతీశ్ ఇంటిపై ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో మద్యంమత్తులో ఫిరోజ్, కోటగిరి సుమన్, కొండ నాగేంద్ర, దాగిమల్ల రమేశ్ నానాబూతులు తిట్టి రాళ్లతో కొట్టారు. అడ్డువచ్చిన సతీశ్ తల్లి లక్ష్మీపై కూడా దాడిచేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
నేడు ఫుడ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ మేళా
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల) కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళాను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారులు తెలిపారు. సివిల్ హాస్పిటల్ వెనకాల గల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీస్‌లో మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94048 93871, 70320 87727లో సంప్రదించాలని సూచించారు.
భీమన్నకు మొక్కులు
వేములవాడ: వేములవాడలో ప్రచారరథం వద్ద రాజన్నను దర్శించుకున్న భక్తులు భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈవో రమాదేవి, ఏఈవోలు, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
దాడిచేసిన వ్యక్తులపై కేసు


