రూ.35వేలతో వార్డు ప్రజలకు సౌకర్యాలు
● వార్డుసభ్యురాలి ఉదారత
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో 3వ వార్డు సభ్యురాలిగా గెలిపించిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సోమవారం బాధ్యతలు చేపట్టిన వార్డు సభ్యురాలు గుజ్జుల జయ రూ.35వేల నగదును స్థానికులకు అందజేశారు. వార్డు ప్రజలందరికీ సౌకర్యార్థంగా ఉండేందుకు వీలుగా అవసరమైన చర్యలు చేపట్టారు. స్థానికులకు ఐదేళ్లపాటు ఉచితంగా దినపత్రిక వేయించడం, వార్డులోని అన్ని వీధుల్లో వీధిదీపాలకు రూ.15వేలతో ఎల్‌ఈడీ లైట్లను బిగించడం జరుగుతోంది. విద్యార్ధులు, యువకుల కోసం రూ.5వేలతో క్రీడాసామగ్రి కొనుగోలు, మిగిలిన రూ.15వేలను వార్డు ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రి ఖర్చుల కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం వార్డుసభ్యురాలు జయ రూ.35వేలతో చేపట్టిన పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


