అల్ఫోర్స్‌లో రామానుజన్ జయంతి
కొత్తపల్లి(కరీంనగర్): గణిత పితామహుడు శ్రీనివా స రామానుజన్ జయంతి సందర్భంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డితో కలిసి గణిత అవధాని, ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఇ.చంద్రయ్య రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గణితం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, మన దేశ గణితశాస్త్రానికి నిర్వచనం రామానుజన్ అని, ఆయన సేవలు చారిత్రాత్మకమన్నారు. ప్రతీ విద్యార్థి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. కాగా, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ టెస్ట్(అమోట్)–2025లో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందించి సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


