పైసల్లేని ప్రయోగం..!
జూనియర్ కాలేజీలకు భారంగా ప్రాక్టికల్స్ నిర్వహణ
ఫిబ్రవరి 2 నుంచి విద్యార్థులకు ప్రాక్టికల్స్
రసాయనాలకు నిధుల లేమి
కళాశాలల్లో కనిపించని సన్నద్ధత
‘ఇంటర్ చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మార్కులు సాధించడం ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్‌లో సాధించే మార్కులు కూడా అంతే కీలకం. సాధారణంగా సైన్స్ గ్రూప్‌లు, ఓకేషనల్ విద్య చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. పరీక్షలకు ముందు నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో ప్రాక్టికల్స్ నామమాత్రంగా కొనసాగుతున్నాయానే విమర్శలు ఉన్నాయి.’
కరీంనగర్‌టౌన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌కు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. మరో 40 రోజుల్లో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి చివరి మాసంలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలు నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రయోగ పరీక్షలంటే వాటికి సంబంధించిన పరికరాలు, కెమికల్స్, ఇతరత్రా వస్తువులు అవసరం ఉంటాయి. కానీ, ప్రభుత్వం ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాక్టికల్స్ తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారని విమర్శలున్నాయి. జిల్లాలో 17,128 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇందులో 11 ప్రభుత్వ కళాశాలలు, 6 టీఎస్ సోషల్ వెల్ఫేర్, 9 మైనార్టీ, 6 ఎంజేపీ, 11 మోడల్ స్కూల్స్, 8 కేజీబీవీ, 49 ప్రైవేట్ కళాశాలలు జిల్లావ్యాప్తంగా మొత్తం 104 కళాశాలున్నాయి.
నిధుల లేమితో భారంగా నిర్వహణ
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ కళాశాలలకు భారంగా మారింది. చదువుకున్న పాఠాన్ని ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలున్నాయి. మూడేళ్లుగా ప్రాక్టికల్స్ నిర్వహణకు సంబంధించిన నిధులు విడుదలకాకపోవడంతో కళాశాలల్లోని ల్యాబ్‌లలో అరకొర వసతులు, శిథిలావస్థలో ఉన్న ల్యాబ్‌లు, తుప్పుపట్టిన పరికరాలతోనే విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పాతవాటితో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రైవేటు విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ కళా శాలలవారు తక్కువ మార్కులను సాధిస్తున్నారు. ఈ ప్రభావం ఎంసెట్ ర్యాంకులపై, ఇతరాత్ర పోటీ పరీక్షల సమయంలో చూపే అవకాశం ఉంది.
అరకొర వసతులు...
సిబ్బంది, నిధులు లేక ప్రభుత్వ కళాశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. గ్రామీణ ప్రాంత క ళాశాలల్లో సమస్యలు అధికంగా ఉంటున్నాయి. జి ల్లాలోని 11 ప్రభుత్వ కాలేజీల్లో 6,500 మంది వర కు విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు తెలుస్తోంది. 7వేల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చ దువుతున్నారు. ప్రతీ విద్యార్థికి రూ.38 చొప్పున క ళాశాలల నిర్వహణకు ప్రభుత్వం ఏటా అందజేస్తుంది. కానీ, ఆరునెలలుగా బిల్లుల రాక కళాశాలల్లో శానిటైజర్లు, రిజిస్టర్లు ఇతరత్రా వస్తువులు కొనేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.
పైసల్లేని ప్రయోగం..!


