డ్రగ్స్‌ మూలాలను పెకిలించాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ మూలాలను పెకిలించాలి

Dec 23 2025 6:59 AM | Updated on Dec 23 2025 6:59 AM

డ్రగ్

డ్రగ్స్‌ మూలాలను పెకిలించాలి

డ్రగ్స్‌ మూలాలను పెకిలించాలి ● కలెక్టర్‌ పమేలా సత్పతి నట్టలనివారణతోనే నష్టాల నివారణ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ క్రీడా పోటీలు ప్రారంభం పవర్‌కట్‌ ప్రాంతాలు

● కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌అర్బన్‌: మాదకద్రవ్యాల వాడకం నిర్మూలించేందుకు జిల్లాలోని అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్‌ సెంటర్‌ కమిటీ సమావేశం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులు సమన్వయంతో డ్రగ్స్‌ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ స్టోర్స్‌లో అమ్మకాలను పరిశీలించాలని, వైద్యుల చీటీ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్‌పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం మాట్లాడుతూ, పోలీసుశాఖ తరఫున విద్యార్థులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. డ్రగ్స్‌ అమ్మకాలు, వినియోగం, రవాణా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కరీంనగర్‌అర్బన్‌: గొర్రెలు, మేకల ఎదుగుదలకు నట్టలే ప్రధాన అవరోధం. పెంపకందారులు వాటిని గుర్తించకపోవడం వల్ల అనారోగ్యంతో మరణిస్తుంటాయి. పదులు, వందల సంఖ్యలో మరణాలు సంభవించడం ఏటా జరుగుతున్న తంతు. ఈ క్రమంలో గొర్రెల పెంపకందారులు లక్షల్లో నష్టపోవడం జరుగుతున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమవారం జిల్లాలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి పలు ప్రాంతాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ నెల 31వరకు కార్యక్రమాలు

జిల్లాలో ప్రాంతీయ, ప్రాథమిక వైద్యశాలలు, ఉప కేంద్రాలు 64 ఉండగా వాటి పరిధిలో నట్టల నివారణ మందును ఉచితంగా అందజేయనున్నారు. గొ ర్రెల వయసు, శరీర బరువు, మందు రకం తదితర అంశాల క్రమంలో మందు మోతాదును నిర్ణయిస్తారు. జీవాల పెంపకందారులు పశు వైద్య సిబ్బంది సూచించే మోతాదు ప్రకారం నట్టల మందు వా డాలని ఏడీహెచ్‌ డా.వినోద్‌కుమార్‌ వివరించారు.

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం జిల్లాస్థాయి ఇంటర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. పో టీలను ఉదయం జిల్లా క్రీడా శాఖ అధికారి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, కళాశాలల మధ్య స్నేహబంధాన్ని కలిగించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డి.శోభారాణి, కె.వెంకటేశ్వర్లు, ఎం.చంద్రప్రకాశ్‌, బి.ఝాన్సీ, సీహెచ్‌.స్వప్న, తుల్జారామ్‌ షా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల మరమ్మతు నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, సీతారాంపూర్‌, ఆర్టీసీ కాలనీల్లో సరఫరా నిలిపివేస్తామని రూరల్‌ ఏడీఈ రఘు తెలిపారు.

డ్రగ్స్‌ మూలాలను   పెకిలించాలి
1
1/1

డ్రగ్స్‌ మూలాలను పెకిలించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement