కరీంనగర్.. రెండో విజయం
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా అండర్ –14 క్రికెట్ జట్టు హెచ్‌సీఏ వన్డే నాకౌట్ టోర్నీలో రెండోవిజయం నమోదు చేసింది. సోమవారం ఘటకేసర్‌లోని కీసర ఏకలవ్య మైదానంలో కరీంనగర్, విజ్ఞాన్ విద్యాలయం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన విజ్ఞాన్ విద్యాలయం జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో భాగంగా కరీంనగర్ జట్టును 43 ఓవర్లలో 172 పరుగులిచ్చి ఆలౌట్ చేసింది. కరీంనగర్ జట్టులో కెప్టెన్ అచ్యుతానంద్ హాఫ్ సెంచరీ(54 పరుగులు) చేయగా, ప్రేంసాయి 44 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విజ్ఞాన్ విద్యాలయం జట్టును కరీంనగర్ జట్టు 42.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ చేసింది. జిల్లా జట్టులో సిద్ధార్థ అద్భుతంగా బౌలింగ్ చేసి 9 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. అదేవిధంగా శ్రయాంక్, వర్షిత్ రెండేసి వికెట్లు తీశారు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సిద్ధార్థ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు. ఈనెల 24న గౌతం మోడల్ స్కూల్, అమీర్‌పేట జట్టుతో మూడోమ్యాచ్ జరుగనుందని పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కరీంనగర్ జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుందని జట్టు మేనేజర్, జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు మహేందర్‌గౌడ్ తెలిపారు.


