విద్యతోనే మహిళల ఉన్నతి
కరీంనగర్‌కల్చరల్: మహిళల ఉజ్వల భవితకు ఏకై క మార్గం ఉన్నత విద్యేనని ప్రముఖ రచయిత, విశ్రాంత ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ ప్రాంగణం, చింతకుంట సాంఘీక సంక్షేమ జూనియర్ కళాశాల ఆవరణలో వేర్వేరు కార్యక్రమాల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. పేదరికాన్ని తరిమే ఆయుధం ఉన్నత విద్య మాత్రమే అన్నారు. ప్రముఖ ధ్యాన శిక్షకుడు లయన్ సింగమ రాజు మాట్లాడుతూ ధ్యానం ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, సామాజిక శ్రేయస్సు కలుగుతుందన్నారు. సీనియర్ లైబ్రేరియన్ అర్జున్, లైబ్రేరియన్ సరిత, కళాశాల అధ్యాపకురాలు ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.


