శాసనసభ కార్యదర్శి స్వగ్రామం కల్వచర్ల
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన రేండ్ల తిరుపతిని తెలంగాణ శాసనసభ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు సామాన్య రైతు కుటుంబానికి చెందిన నర్సయ్య–లక్ష్మి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన తిరుపతి భువనగిరి, వరంగల్, బోధన్, హైదరాబాద్, భద్రాచలం, ఖమ్మం, రంగారెడ్డి, తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌గా, హైదరాబాద్ ఏసీబీ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో సనిచేశారు. 2023 ఆగస్టు 21 నుంచి 2025 ఆగస్టు 20 వరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శిగా, 2025 ఆగస్టు 22 నుంచి తెలంగాణ వక్ఫ్ ట్రెబ్యునల్ చైర్మన్‌గా పనిచేయగా ప్రభుత్వం శాసనసభ కార్యదర్శిగా నియమించింది. తిరుపతి నియామకంపై కల్వచర్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు


