జనావాసాల్లోకి జింక
పెద్దపల్లిరూరల్: అడవుల్లో చెంగుచెంగున ఎగిరే జింకపిల్ల దారి తప్పింది.. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలోని జనావాసాల్లోకి వచ్చింది. ఆదివారం కొమ్ము మోహన్ ఇంటి ఆవరణలో గుర్తించిన స్థాని కులు దాన్ని పట్టుకున్నట్లు తెలుసుకున్న సర్పంచ్ తనయుడు కొమ్ము అభిలాష్ అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స తీశ్‌కుమార్ వాహనాన్ని సమకూర్చి సెక్షన్ ఆఫీసర్ మంగిలాల్, బీట్ ఆఫీసర్ రామ్మూర్తితో జింకను బ సంత్‌నగర్ అటవీప్రాంతంలో వదిలేశారు. అట వీ ప్రాంతంలో మేతకు వెళ్లిన గొర్రెల మందలో కలిసి గ్రామంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.


