భక్తులు ఎక్కువ.. రైళ్లు తక్కువ
బస్సు ప్రయాణం అసౌకర్యమే..
ప్రస్తుతం నడిచే రైళ్లు నేరుగా వెళ్లవు
రామగుండం: కాగజ్‌నగర్ (కోల్‌బెల్ట్) నుంచి నేరుగా తమిళనాడులోని తిరువన్నామలై (అరుణాచలం) అరుణాచలేశ్వరాలయానికి వెళ్లేందుకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్నా రైల్వేశాఖ క్యాష్ చేసుకోవడంలో విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రద్దీని గుర్తించి కాలానుగుణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరిఖని, కరీంనగర్ డిపోల నుంచి అరుణాచలంకు నేరుగా బస్సులను నడిపిస్తూ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటుంది. ప్రస్తుతం కరీంనగర్–తిరుపతి మీదుగా అనే రైళ్లు నడుస్తున్నాయి. ఇదే తరహాలో అరుణాచలంకు కూడా నేరుగా రైలు సర్వీసులు నడిపించాలని భక్తుల నుంచి డిమాండ్ వస్తుంది.
ప్రత్యేక రైలుతో పుణ్యక్షేత్రాల దర్శనం
సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి అరుణాచాలంకు ప్రత్యేక రైళ్లు నడిపితే విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి శివాలయం, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరాలయం, చిత్తూరులోని కాణిపాకం, వేలూర్ (తమిళనాడు)లోని గోల్డెన్ టెంపుల్, కాంచీపురంలోని కామాక్షి ఆలయాలు తదితర పుణ్యక్షేత్రాల సందర్శనకు సౌకర్యంగా ఉంటుంది. ఫలితంగా భక్తుల రద్దీ పెరిగి రైల్వేశాఖకు గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.
అరుణాచలంకు రోజురోజుకు పెరుగుతున్న భక్తులు
వీక్లీ రైళ్లు నడిపించాలని డిమాండ్
ఆర్టీసీ బస్సు ప్రయాణం గంటల తరబడి అంటే అసౌకర్యం. చార్జీలు, ప్రయాణ సమయం ఎక్కువే. రైలు ప్రయాణం చార్జీలు తక్కువ, సౌకర్యవంతంగా ఉంటుంది. నాలుగైదు కుటుంబాలతో వెళ్లే తీర్థయాత్రలు మరపురాని జ్ఞాపకాలను మిగుల్చుతాయి.
– కమ్మల చంద్రశేఖరశర్మ, రామగుండం
కాగజ్‌నగర్ నుంచి రామగుండం మీదుగా త్రివేండ్రంకు నడిచే రైళ్లు కేరళ, తమిళనాడులోని కా ట్పాడి మీదుగా వెళ్తాయి. కాట్పా డి నుంచి అరుణాచలంకు 80 కిలోమీటర్లు ఉంటుంది. తొలుత వీక్లీ రైళ్లను నడిపించాలని ఒత్తిడి తీసుకువస్తా. ప్రధానంగా ఎంపీలు సైతం ఈ రూట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి.
– కంకటి ఫణికుమార్, అధ్యక్షుడు, రైల్వేఫోరం
భక్తులు ఎక్కువ.. రైళ్లు తక్కువ
భక్తులు ఎక్కువ.. రైళ్లు తక్కువ


