పారా మోటారింగ్ టూరిజంపై పరిశీలన
రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పారామోటారింగ్ టూరిజం ఏర్పాటుకు ఆదివారం పొరుగు రాష్ట్రాల నుంచి పలువురు రైడర్స్ పరిశీలన నిమిత్తం వచ్చారు. ఈ విషయమై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌తో స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన పారా మోటారింగ్ రైడర్ అర్జున్ పలు విషయాలు చర్చించారు. పారా మోటారింగ్ యంత్రంతో నిష్ణాతులైన రైడర్స్ రామగుండంకు చేరుకోగా స్థానిక జెన్‌కో గ్రౌండ్ నుంచి యంత్రం సాయంతో ఫ్లయింగ్ చేస్తూ కొండలు, వాగులు, గోదావరినది, అటవీ ప్రాంతం, రాజీవ్ రహదారి, రైల్వే ట్రాక్, విద్యుత్ కేంద్రాలు, అంజనాద్రి జంక్షన్, రామునిగుండాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతీ పంపుహౌజ్ తదితర సుందరమైన దృశ్యాలను తిలకించి పారా మోటారింగ్ రైడింగ్‌కు స్థానికంగా అనుకూలంగా ఉందని ధ్రువీకరించినట్లు అర్జున్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పారా మోటారింగ్‌తో సుందర దృశ్యాలను వీక్షించేలా ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశీలనలో పారా మోటారింగ్ రైడర్స్ సుజిత్ (ముంబయి), పరమేశ్ (హైదరాబాద్), అర్జున్ (రామగుండం) తదితరులు పాల్గొన్నారు.
ఫ్లయింగ్‌తో ఆకర్షణీయమైన దృశ్యాలు
తిలకించేందుకు పర్యాటకుల ఆసక్తి
పారా మోటారింగ్ టూరిజంపై పరిశీలన


