ఏ విద్యార్థికి దంత సమస్యలు ఉండొద్దు
కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడకుండా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి విద్యార్థులందరికీ దంత వైద్య పరీక్షలు చేయాలన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంకమ్మతోట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దంత చికిత్స చేశారు. కలెక్టర్ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీరును పరిశీలించారు. కార్పొరేట్ స్థాయిలో ఉచి తంగా అందిస్తున్న దంత వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 12వేల మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నామని, దంత సమస్యలతో బాధపడుతున్న 1500మందిని గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23 వరకు మొదటి విడత క్యాంపులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ జి.వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీనా, వైద్యులు రవి ప్రవీణ్, రణధీర్, ప్రవీణ్, రాజిరెడ్డి, మంగ, శరత్ పాల్గొన్నారు.
కంగ్రాట్స్.. మేడమ్
కరీంనగర్ అర్బన్: పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ ముందు వరుస స్థానంలో నిలవడంపై ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
అప్రమత్తతతోనే నష్ట నివారణ
ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ, నష్టాలను నివారించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ నెల 22న విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు విపత్తు నివారణ చర్యలపై చర్చించారు.


