
కష్టపడి చదువుకోవాలి
కరీంనగర్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ ఆధ్వర్యంలో నగరంలోని బాలసదన్, శిశుగృహాలను శుక్రవారం సందర్శించారు. చిన్నారులతో ముచ్చటిస్తూ కష్టపడి చదువుకుని ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. క్రీడాదినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. శిశుగృహలోని ఆహార పదార్థాలు నిల్వ చేసే గదులను తనిఖీ చేశారు. పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఎలాంటి న్యాయపరమైన సేవ అవసరమైనా సంప్రదించాలని ఆదేశించా రు. సీనియర్ సివిల్ జడ్జితో పాటు లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు.
2న తుది ఓటరు జాబితా
కరీంనగర్ అర్బన్: గ్రామ పంచాయతీ తుది ఓటరు జాబితా సెప్టెంబర్ 2న ప్రకటించడంతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. గ్రామ పంచాయతీ ఓటరు లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్‌పై శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జా బితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్‌డేట్ చే యడం జరుగుతోందని అన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఈ నెల 28న విడుదల చేయడం జరిగిందని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోపు తెలియజేయాలన్నారు. 31లోపు అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని వివరించారు. డీపీవో వి.జగదీశ్వర్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని మదీనా కాంప్లెక్స్ ప్రాంతంలో నూతన మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గతంలో ఉన్న ఓపెన్ టాయిలెట్ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో, నూతన ప్రజా మరుగుదొడ్డి నిర్మాణం కోసం శుక్రవారం ఆయన స్థల పరిశీలన చేశారు.
కరీంనగర్: డాక్టర్ సర్వేపల్లి జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానం చేస్తామని డీఈవో చైతన్య జైనీ తెలిపారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలి పారు. దరఖాస్తులను ఈనెల 31వ తేదీ సా యంత్రం 5గంటల్లోగా డీఈవో కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.

కష్టపడి చదువుకోవాలి

కష్టపడి చదువుకోవాలి